ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశమంతా గులాబీ జెండా ఎగరాలి.. కిసాన్‌ సర్కార్‌ రావాలి: కేసీఆర్ - BRS public meeting in Nanded latest news

KCR Interesting Comments in Nanded: నాందేడ్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల క్రితం తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవని అన్నారు. క్రమంగా ఆ సమస్యలను అధిగమించామని చెప్పారు. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి.. కిసాన్‌ సర్కార్‌ రావాలని ఆయన పేర్కొన్నారు.

kcr
ముఖ్యమంత్రి కేసీఆర్

By

Published : Feb 5, 2023, 6:58 PM IST

KCR Interesting Comments in Nanded: మహారాష్ట్ర వ్యాప్తంగా వారం, పది రోజుల్లో ఇంటింటికి బీఆర్​ఎస్ ప్రచారం నిర్వహిస్తామని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం మహారాష్ట్రీయులు పిడికిలి బిగించాలని సూచించారు. 8 ఏళ్ల క్రితం తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవని గుర్తు చేశారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ కొరత ఉండేదని తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్​లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయన వెల్లడించారు.

తెలంగాణలో క్రమంగా అన్ని సమస్యలను అధిగమించామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని వివరించారు. రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నామని అన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5లక్షల బీమా ఇస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.

ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్‌ రావాలి: ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్‌ రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్​ను గెలిపించాలని ఆయన కోరారు. దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చని తెలిపారు. తెలంగాణలో వచ్చిన మార్పు.. దేశమంతా రావాల్సిన అవసరముందని వివరించారు. రైతు సర్కార్‌ వస్తేనే దేశం మారుతుందని స్పష్టం చేశారు.

దేశమంతా గులాబీ జెండా ఎగరాలి.. కిసాన్‌ సర్కార్‌ రావాలి: బీఆర్ఎస్​కు అధికారం ఇస్తే.. రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్‌ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పంటలు కొనమని నెలలపాటు రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి.. కిసాన్‌ సర్కార్‌ రావాలని పేర్కొన్నారు. తెలంగాణలోని దళితబంధు దేశమంతా అమలు కావాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని వెల్లడించారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి సభకు భారీగా ప్రజలు తరలివచ్చారని కేసీఆర్ తెలిపారు. నాందేడ్‌ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు.. తన గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయని వివరించారు. మహారాష్ట్ర, దేశమంతా బీఆర్ఎస్ కిసాన్‌ కమిటీలు వేస్తామన్నారు. జై మహారాష్ట్ర, జై భారత్ అంటూ కేసీఆర్‌ ప్రసంగాన్ని ముగించారు.

నాందేడ్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు

"దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, కిసాన్‌ సర్కార్‌ రావాలి. తెలంగాణలోని దళితబంధు దేశమంతా అమలు కావాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి సభకు భారీగా తరలివచ్చారు. నాందేడ్‌ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు నా గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి. మహారాష్ట్ర, దేశమంతా బీఆర్ఎస్ కిసాన్‌ కమిటీలు వేస్తాం." -కేసీఆర్, సీఎం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details