ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిమాన్షు నోట బాలయ్య డైలాగ్‌... వైరల్‌గా మారిన ట్వీట్ - KTR Son Uses Balayya Famous Dialogue

KTR Son Uses Balayya Famous Dialogue: తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు చేసిన పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్‌ ట్వీట్‌కు బాలయ్య డైలాగ్‌తో రిప్లై ఇచ్చి.. షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు.. హిమాన్షును చూసిన నెటిజన్స్‌.. సేమ్‌ టు సేమ్‌ కేటీఆర్‌లా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.

KTR Son Uses Balayya Famous Dialogue
KTR Son Uses Balayya Famous Dialogue

By

Published : Nov 15, 2022, 2:56 PM IST

KTR Son Uses Balayya Famous Dialogue : తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు.. తండ్రిలానే సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే తాజాగా ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఏకంగా బాలయ్య డైలాగ్ వేసి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఏం జరిగిందంటే..

గతంలో హిమాన్షు రావు అధికబరువు కారణంగా అనేకసార్లు బాడీ షేమింగ్‌కు గురైన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు సైతం.. చాలా సార్లు మీడియా సమక్షంలో బాడీ షేమింగ్ చేశారు. సోషల్ మీడియాలో సైతం హిమాన్షు శారీరాకృతిపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేసేవారు. దీనిపై కేటీఆర్ సైతం చిన్నపిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం దేనికి అని ఆవేదన వ్యక్తం చేశారు.

దీని తర్వాత ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసిన హిమాన్షు.. ఆశ్యర్యంగా బరువు తగ్గారు. తనను ట్రోల్ చేసే వారికి.. ఒక్కసారిగా షాక్‌ ఇచ్చారు. అయితే తాజాగా ఓ నెటిజన్ హిమాన్షు ఫొటోను పోస్ట్ చేసి.. సడెన్‌గా చూసి కేటీఆర్ అనుకున్నా.. అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆ పోస్టుకు హిమాన్షు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు . ''ఒక గొప్ప వ్యక్తి చెప్పారు... సర్‌సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటీ..'' అంటూ బాలయ్య బాబు డైలాగ్ వేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక హిమాన్షు తాజా ఫోటో చూస్తే మాత్రం.. సేమ్‌ టు సేమ్‌ కేటీఆర్‌ లాగే ఉన్నారంటూ.. కామెంట్ చేస్తున్నారు. హిమాన్షు పోస్ట్‌కు లైకులు కొడుతూ... రీట్వీట్‌లు చేస్తున్నారు. అంతేకాదు హిమాన్షు ఇంతగా మారడం వెనుక ఉన్న రహస్యాన్ని తమకు కూడా చేప్పాలని చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details