KCR attended the wedding : కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. నవ దంపతులను కేసీఆర్ ఆశీర్వదించారు. అంతక ముందు సీఎం కేసీఆర్‌కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద భారీ భద్రత కల్పించినా.. టీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎగబడ్డారు.
హెలికాప్టర్‌లో ఎర్రవల్లి నుంచి కరీంనగర్ చేరుకోగా.. ప్రత్యేక వాహనంలో వివాహానికి హాజరయ్యారు. నవదంపతులను ఆశీర్వదించి.. వారితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు సేదతీరి.. తేనీటి విందు స్వీకరించి.. సాయంత్రం హైదరాబాద్ వచ్చారు.