ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప అవార్డు - today kayakalpa Award latest news

జాతీయ స్థాయిలో ప్రదానం చేసే కాయకల్ప అవార్డుల్లో.. రాష్ట్రంలోని 2 జిల్లా ఆసుపత్రులు మొదటి, రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. దేశంలోని పలు డీహెచ్, సీహెచ్ సీ, పీహెచ్ సీలతో పోటీ పడి.. పురస్కారాలకు ఎంపికయ్యాయి. భవన నిర్మాణాలతోపాటుగా పలు విభాగాల్లో మెరుగైన సేవలను అందించినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

kayakalpa Award for two Government Hospitals
కాయకల్ప అవార్డులో మొదటి స్థానం పొందిన తెనాలి ఆసుపత్రి

By

Published : May 30, 2021, 11:15 AM IST

ఆంధ్ర పారిస్ గా పిలవబడే తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రి.. గుంటూరు తరువాత అతి పెద్ద జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచింది. దీంతోపాటుగా మరో ఘనతను సాధించింది. జాతీయస్థాయి కాయకల్ప అవార్డులో గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రభుత్వ వైద్యశాల.. తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అవార్డు ద్వారా 20 లక్షల నగదు బహుమతి అందుతుందని తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ పురస్కారం దక్కిందన్న ఆయన...వారందరికీ అభినందనలు తెలిపారు.

ఈ అవార్డు ఎంపికకు ఆసుపత్రి భవనాలు, శానిటేషన్, వేస్ట్ మేనేజ్​మెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, సపోర్ట్ సర్వీసెస్, హైజీన్ ప్రమోషన్స్, ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ వంటి నిర్మాణాలు.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తారని ఆయన పేర్కొన్నారు. ద్వితీయ స్థానం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి లభించింది. మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా పురస్కారం దక్కిందని.. ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు స్వప్నకు పలువురు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details