ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లె మున్సిపల్ ఛైర్​పర్సన్​గా కట్ట మంగ ఎన్నిక - రేపల్లె మున్సిపల్ ఛైర్మన్​గా ప్రమాణం చేసిన కట్ట మంగ

13వ వార్డుకు చెందిన కట్ట మంగ.. గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపల్ ఛైర్​పర్సన్​గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు హాజరయ్యారు. పట్టణంలోని పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

katta manga elected as repalle municipal chairman
రేపల్లె మున్సిపల్ ఛైర్​పర్సన్​గా కట్ట మంగ ఎన్నిక

By

Published : Mar 18, 2021, 4:34 PM IST

Updated : Mar 18, 2021, 8:50 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపల్ ఛైర్​పర్సన్​గా కట్ట మంగ ఎన్నిక ఏకగ్రీవమయ్యారు. 19వ వార్డుకు చెందిన గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్​ను వైస్ ఛైర్మన్​గా ఎన్నుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు పాల్గొన్నారు. ఎన్నికైన ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్​లతో పాటు ఇతర వార్డు సభ్యులను ఎంపీ సత్కరించారు.

సీఎం జగన్ నాయకత్వానికి ప్రజలు పట్టంకట్టి, స్థానిక ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇచ్చారని ఎంపీ మోపిదేవి అన్నారు. ప్రజా సునామీలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పుర ఎన్నికల్లో వైకాపా విజయకేతనం ఎగురవేసిందని కొనియాడారు. రేపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణం, ఇండోర్ స్టేడియం, పాత భవనాల స్థానంలో నూతన నిర్మాణాలు చేపడతామన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు.

Last Updated : Mar 18, 2021, 8:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details