గుంటూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కాకాని భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తిక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. లక్ష రుద్రాక్షలతో ప్రత్యేకంగా అలంకరించిన శివలింగానికి తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన భక్తుడు కొల్లి శేషి రెడ్డి దంపతులు బహుకరించిన వెండి పంచముఖ కవచం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపారాధన చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు యజ్ఞాల బావి దగ్గర స్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు.
కాకాని భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తికమాసం శోభ - karthikamasam in kakani bhramaramba malleshwara swamy temple news
గుంటూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కాకాని భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తికమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కాకాని భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం