new districts in ap: విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని 13 జిల్లాల కాపునాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులో కాపునాడు నేతలు, రంగా-రాధా అభిమానులు సమావేశమయ్యారు. తమ డిమాండ్ ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలంటూ తీర్మానం చేశారు. రంగా-రాధా రాయల్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కాపునాడు నేత పిల్లా వెంకటేశ్వరరావు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల జనాభా ఉన్న కాపులకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కడం లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాకు స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
'విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి' - ఏపీలో కొత్త జిల్లాలు
new districts in ap: గుంటూరులో కాపునాడు నేతలు, రంగా - రాధా అభిమానులు సమావేశమయ్యారు. విజయవాడ జిల్లాకు వంగవీటి, గుంటూరు జిల్లాకు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కాపులకు సరైనా ప్రాతినిధ్యం దక్కడం లేదని కాపు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
named-vijayawada-as-ntr-district-kapu-community-demands-for-vangaveeti-ranga-district-full