ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. ఎన్నికల ముందు ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. 'మాట తప్పను మడమ తిప్పను' అని ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికి.. ఇప్పుడు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై భారం మోపారని అభిప్రాయపడ్డారు. రివర్స్ గేర్లో రాష్ట్రాన్ని జెట్ స్పీడ్లో పరుగెత్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని రివర్స్ గేర్లో పరుగెత్తిస్తున్నారు: కన్నా - kanna laxminarayana latest news
ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
'ఆర్టీసీ ఛార్జీలపై ప్రభుత్వం యూటర్న్'