ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని రైతుల సమస్యల పై సీఎం జగన్​కు కన్నా లేఖ - ముఖ్యమంత్రి జగన్​కు కన్నా లేఖ

రాజధాని రైతుల సమస్యలు గురించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్​కు లేఖ రాశారు. అన్నదాతల కౌలు రెట్టింపు చేయాలని కోరారు.

Kanna Letter To Cm jagan
సీఎం జగన్​కు కన్నా లేఖ

By

Published : Apr 27, 2020, 5:37 PM IST

కరోనా నేపథ్యంలో రాజధాని రైతులకు కౌలు రెట్టింపు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. అమరావతిలో రాజధాని కొనసాగించటంతో పాటు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాజధాని రైతులు ఇవాళ కన్నాను కలిశారు. రాజధాని మార్పు పేరిట అమరావతిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలీసుల వేధింపులను కన్నా దృష్టికి తెచ్చారు. లాక్ డౌన్ సమయంలో రాజధాని మహిళలు తమ ఇళ్లలో ఉండి... కరోనా సహాయ చర్యల కోసం మాస్కులు కుట్టి... వాటిని కన్నాకు అందజేశారు. వైద్యులు, పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని కోరారు. కరోనా కారణంగా ఎలాంటి ఉపాధి లేని పరిస్థితుల్లో కనీసం కౌలు రెట్టింపు చేయాలన్నారు. ఈ సమస్యను కన్నా లేఖ రూపంలో ముఖ్యమంత్రికి తెలియజేశారు.

సీఎం జగన్​కు కన్నా లేఖ

ABOUT THE AUTHOR

...view details