దేవాదాయ శాఖ నుంచి అమ్మఒడి పథకానికి నిధులు మళ్లింపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మళ్లించిన నిధులను మళ్లీ దేవాదాయ శాఖకు జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
'దేవాదాయ శాఖ నుంచి మళ్లించిన నిధులు తిరిగి జమచేయాలి' - దేవాదాయ శాఖ నిధులపై కన్నా లక్ష్మీ నారాయణ
దేవాదాయ శాఖ నుంచి అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి జమ చేయాలని సీఎం జగన్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనన్నారు. అలాంటిది దేవాదాయ శాఖ నిధులు వేరే పథకాలకు ఎలా వాడతారని లేఖలో ప్రశ్నించారు.

సీఎం జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ
దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనన్నారు. అలాంటిది దేవాదాయ శాఖ నిధులు వేరే పథకాలకు ఎలా ఉపయోగిస్తారని లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మఒడి పథకానికి మళ్లించి 24కోట్లు 25 లక్షల 75వేల రూపాయలు తక్షణమే దేవాదాయశాఖకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'సెప్టెంబర్ 5 న పాఠశాలలు పున: ప్రారంభించే అవకాశం'