రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిజంగానే చేస్తే.. మున్సిపల్ ఎన్నికలకు వైకాపా ఎందుకు భయపడుతోందని భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. గుంటూరులోని ఐదు, ఆరో డివిజన్లలో పార్టీ ఎన్నికల కార్యాలయాల్ని ప్రారంభించిన ఆయన.. మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు, బెదిరింపులతో గెలవాలని అధికార పార్టీ చూస్తోందని ఆరోపించారు.
జనసేన - భాజపా అభ్యర్థులు నామినేషన్లు వెనక్కు తీసుకోవాలంటూ పోలీసులతో ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల వైకాపా పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహించారు. అభివృద్ధిని కోరుకునే వారంతా భాజపా - జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.