ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 23న టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.. - CBN

Kanna To Join TDP: సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ... తెలుగుదేశంలో చేరనున్నారు. ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీతో కలిసి ఉన్న జనసేనలోకి వెళ్లొద్దని, టీడీపీలో చేరడమే మంచిదన్న సన్నిహితులు, అభిమానుల సూచనల ప్రకారం అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 20, 2023, 10:43 AM IST

23న తెదేపా లోకి కన్నా లక్ష్మీనారాయణ

Kanna To Join TDP: మాజీ మంత్రి, ఇటీవలే బీజేపీకి రాజీమానా చేసిన సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ... తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల23వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో... తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేకపోయిన కన్నా.. ఈ నెల 16వ తేదీన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం గుంటూరులోని తన నివాసంలో సన్నిహితులు, అభిమానులతో సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు హాజరై అభిప్రాయాలు పంచుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు, రాక్షస పాలనతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని.. కన్నాతో పాటు సుదీర్ఘ కాలంగా రాజకీయ ప్రయాణం చేస్తున్న తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌, డా.సుబ్రహ్మణ్యం, సైదారావుతో పాటు మరికొందరు నేతలు అన్నారు. అమరావతి రాజధాని విషయంలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వ తీరుతో అన్యాయం జరుగుతోందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయగల సమర్థత, రాజకీయ దక్షత ఒక్క చంద్రబాబుకే ఉందని అన్నారు. కన్నా లాంటి సీనియర్లు చంద్రబాబు సారథ్యంలో పనిచేస్తే... రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాక్షేమం దృష్ట్యా తెలుగుదేశంలో చేరాలని సూచించారు. ప్రభుత్వ దమననీతి, అరాచకాలపై బీజేపీ పోరాటం చేయడం లేదని ఇంకొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. అలాంటి పార్టీతో కలిసి ఉన్న జనసేనలోకి వెళ్లొద్దని, తెలుగుదేశంలో చేరితేనే మంచిదని సూచించారు.

తొమ్మిదేళ్లుగా ఏ అధికార పదవుల్లో లేకపోయినా కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వారి అభిప్రాయాలు, నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకుపోదామని.. సన్నిహితుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. నందమూరి తారకరత్న చనిపోవటంతో మిగతా విషయాల గురించి ఇప్పుడు మాట్లాడనన్నారు. త్వరలోనే రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

సమావేశం తర్వాత కన్నా లక్ష్మీనారాయణను ఫోన్‌లో సంప్రదించగా.. సన్నిహితులంతా తెలుగుదేశంలో చేరాలని సూచించినట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమరావతి ఉద్యమానికి మద్దతు పలికానని.. రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు చేశానని గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా... ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, కార్యకర్తలు కోరిన విధంగా తెలుగుదేశంలో చేరనున్నట్లు కన్నా తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details