'ఇకనైనా ప్రజాధనం దుర్వినియోగం చేయకండి' - కన్నా లక్ష్మీనారాయణ తాజా వార్తలు
వైకాపాకు పట్టుకున్న రంగుల పిచ్చికి కోర్టులో చుక్కెదురైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రంగులు తొలగించాలన్న హైకోర్టు తీర్పుపై ట్విట్టర్లో కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చెట్టు పుట్ట నుంచి పాఠశాలలు, గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు వేశారన్న కన్నా... ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం అక్రమమని పేర్కొన్నారు. సుమారు రూ.1400 కోట్లు దుర్వినియోగం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రంగులు మార్చడానికి ఎంత వృథా చేయనున్నారోనని పేర్కొన్నారు. ఇకనైనా ప్రజాధనం దుర్వినియోగం చేయకండని హితవు పలికారు.
కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్
ఇదీ చదవండీ... తెలుగు రాష్ట్రాలకు నలుగురు న్యాయమూర్తులు