ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్‌డౌన్ ముగిశాక తేదీ చెబుతా.. వచ్చి ప్రమాణం చేస్తారా?' - విజయసాయిరెడ్డికి కన్నా కౌంటర్

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబుకు కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని మరోసారి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అవసరమైతే కాణిపాకం వినాయకుడి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి ఈ విషయాలన్నీ చెప్పగలనన్నారు. ఈ వ్యాఖ్యలకు కన్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

vijayasai vs kanna
vijayasai vs kanna

By

Published : Apr 21, 2020, 7:45 PM IST

మీడియాతో కన్నా లక్ష్మీనారాయణ

ర్యాపిడ్‌ టెస్టు కిట్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ పారదర్శకత నిరూపించుకోవాలని కోరితే వ్యక్తిగత దూషణలకు పాల్పడతారా అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరిగినందుకే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తనకు 20 కోట్ల రూపాయలు ఇచ్చారనే విషయంలో విజయసాయిరెడ్డి కాణిపాకంలో ప్రమాణం చేస్తాననడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. లాక్​డౌన్ ముగియగానే తేది నిర్ణయిస్తామని... విజయ సాయి అక్కడికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు. భాజపాలో నిధుల దుర్వినియోగంపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమన్న కన్నా... ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు.

తగిన మూల్యం చెల్లించుకుంటారు..
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ సైతం స్పందించారు. ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తానంటున్న విజయసాయిరెడ్డి.. ప్రమాణంతో పాటు తనపై వచ్చిన ఆరోపణల విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ మీద, నాయకుల మీద అవాకులు చెవాకులు పేలితే విజయసాయిరెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details