ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పద్ధతి మార్చుకోపోతే వైకాపా పతనం తప్పదు: కన్నా - bjp

సంఘటిత పర్వ్​-2019 కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరైనారు. తెదేపా చేసిన తప్పే వైకాపా ప్రభుత్వం పునరావృతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయి కార్యకర్తలపై దాడులు హేయనీయమన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Jul 31, 2019, 9:01 AM IST

సంఘటిత పర్వ్​-2019
గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన సంఘటిత్​ పర్వ్​-2019 కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ హాజరయ్యారు. నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తెదేపా చేసిన తప్పే వైకాపా పునరావృతం చేస్తోందని మండిపడ్డారు. గ్రామాల్లో దాడులు చేయడం ఆపకపోతే ఆ పార్టీ దుస్థితే అధికారపక్షానికీ పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ తీరు, పల్నాడు ప్రాంతాల్లో పోలీస్​హింసకు వ్యతిరేకంగా ...ఆగస్టు 16న గురజాలలో ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details