గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో శ్రావణమాసం శుక్రవార వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. రహదారి వెంట ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తులు పూజలు చేసారు.అనంతరం లక్షగాజులతో అమ్మవారి ప్రత్యేక అలంకరణ చేయగా.. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
లక్షగాజులతో అమ్మవారి ప్రత్యేక అలంకరణ .... - one lack bangles
రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పెద్దఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.
kanakadurgamma temple decorated with one lack bangles in ponnuru at guntur district