గుంటూరు జిల్లాలోని కమ్మవారి పాలెం ప్రభ విశిష్టతను గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ .. దేశంలోనే చెక్కలతో నిర్మించిన ఎత్తైన ప్రభగా గుర్తించి ధ్రువపత్రాన్ని అందజేసింది. గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. కడ్డీలు, చెక్కలతో 101.7 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పుతో ఈ ప్రభను నిర్మించారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కమ్మవారి పాలెం ప్రభకు చోటు - Kotappakonda Thirunala prabha News
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కమ్మవారి పాలెం గ్రామానికి చెందిన ప్రభకు చోటు దక్కింది. ఈ మేరకు నిర్వాహకులకు ధ్రువ పత్రం అందింది. రాతి బండిపై 101.7 అడుగుల ఎత్తుతో 14 అడుగుల వెడల్పుతో ఈ ప్రభను నిర్మించారు.
మహాశివరాత్రి వచ్చిందంటే గుంటూరు జిల్లా లో కోటప్పకొండ తిరుణాలు అందరి మనసులో ఒక సారి గుర్తుకొస్తుంది. కోటప్పకొండ తిరుణాలలో చిలకలూరిపేట ప్రాంతం నుంచి వచ్చే ప్రభలదే ప్రత్యేకత. కమ్మవారిపాలెం, కావూరు, మద్దిరాల, యడవల్లి అప్పాపురం ,అమీన్ సాహెబ్ పాలెం, పురుషోత్తమ పట్టణం లో నుంచి వచ్చే 15 ప్రభలు కోటప్ప కొండ వద్ద సందడి చేస్తాయి.అందులో కమ్మవారిపాలెం ప్రభ అన్నిటికన్నా ప్రత్యేకంగా ఉంటుంది. వందల సంవత్సరాల నుంచి ప్రభలు నిర్మించి కోటప్పకొండకు తరలించటం ఆనవాయితీగా వస్తోంది. భక్తిశ్రద్ధలతో చేస్తున్న ఈ కార్యక్రమం... దేశ విదేశాల్లో సైతం ప్రాముఖ్యతను సంతరించుకునేలా చేసింది.
ఇదీ చదవండి