ప్రపంచ దేశాలు మిలిటరీపై నాలుగున్నర రోజుల పాటు వెచ్చించే మొత్తంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలలందరికి ఉచిత ప్రాథమిక విద్య అందించవచ్చని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్జాన్ కళాశాలకు వచ్చిన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాలకార్మికుల నిర్మూలించలేనంత పేదరికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లేదని కైలాశ్ సత్యార్థి అన్నారు. సాంకేతిక రంగంలో ఎంతో పురోగతి సాధించినా.. ఆధునిక ప్రపంచంలో బాలలు ఇంకా పనిముట్లు పట్టుకోవడం దురదృష్టకరమన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని... సమాజ ఉన్నతికి తమవంతు కృషి చేయాలని సూచించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి: కైలాష్ సత్యార్థి - kailash satyarthi visited guntur
నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ కళాశాలకు వచ్చారు. విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని సమాజ ఉన్నతికి కృషి చేయాలని సూచించారు.
కైలాశ్ సత్యార్థి గుంటూరు పర్యాటన