'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి' - అమరావతి ఇస్యూ
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు కాగడాల ర్యాలీ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు వేల ఎకరాలు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని నేతలు అన్నారు.