పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌ను తక్షణమే చెల్లించాలంటూ.. గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. 6 నెలలుగా స్టైఫండ్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్‌లో స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2020 మార్చిలో హౌస్ సర్జన్‌గా చేరిన జూనియర్ వైద్యులకు.. 6 నెలలుగా స్టైఫండ్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సామాన్య, అత్యవసర సేవలను నిలిపివేసి ఆందోళన కొనసాగిస్తామన్నారు. అధికారులు తమకు.. లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు.
జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన.. స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ - గుంటూరు జీజీహెచ్ వార్తలు
గుంటూరు జీజీహెచ్‌లో జునియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌ను తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సామాన్య, అత్యవసర సేవలను నిలిపివేసి ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

స్టైఫండ్‌ను చెల్లించాలని జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్ల ఆందళన