గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ న్యాయమూర్తుల రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం నిర్వహిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల న్యాయమూర్తులు నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర విభజన తర్వాత న్యాయమూర్తులందరితో జరిగే మెుట్టమెుదటి సమావేశం ఇది. కేసుల విచారణలో సాంకేతికత గురించి న్యాయమూర్తులకు అవగాహన కలిగిస్తారు. పెండింగ్ కేసులు, ఇతర అంశాలపైనా సమీక్షించనున్నారు. హైకోర్టుతో పాటు అన్నీ జిల్లాల నుంచి మొత్తం 539 మంది న్యాయమూర్తులు హాజరు కానున్నారు.
ఏఎన్యూ వేదికగా న్యాయమూర్తుల రాష్ట్ర స్థాయి సమావేశం - ఏఎన్యూ వేదికగా న్యాయమూర్తుల రాష్ట్ర స్థాయి సమావేశం
రాష్ట్ర విభజన తర్వాత మెుట్టమెుదటి న్యాయమూర్తుల రాష్ట్ర స్థాయి సమావేశం ఇవాళ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి అధ్యక్షత వహించనున్నారు.
![ఏఎన్యూ వేదికగా న్యాయమూర్తుల రాష్ట్ర స్థాయి సమావేశం judges meet in ANUin guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5230906-75-5230906-1575154418344.jpg)
ఏఎన్యూ వేదికగా న్యాయమూర్తుల రాష్ట్ర స్థాయి సమావేశం