ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా సాగుతున్న పార్టీల ప్రచారాలు

రాష్ట్రంలోని ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు దాదాపుగా ఖరారు కావటంతో గుంటూరు జిల్లాలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

జోరుగా సాగుతున్న పార్టీల ప్రచారాలు

By

Published : Mar 18, 2019, 6:28 AM IST

Updated : Mar 18, 2019, 6:54 AM IST

జోరుగా సాగుతున్న పార్టీల ప్రచారాలు

రాష్ట్రంలోని ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు దాదాపుగా ఖరారు కావటంతో... గుంటూరు జిల్లాలో ప్రచార కార్యక్రమాలుఊపందుకున్నాయి.వైకాపా నుంచి 17అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెదేపా ఇంకా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గుంటూరు పశ్చిమ టికెట్ దక్కించుకున్న తెదేపా అసెంబ్లీ అభ్యర్థి మద్దాలి గిరి... నగరంలోని వేలాంగిణి నగర్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉద్యోగ, ఉపాధి కోసం తెదేపాను మళ్లీ గెలిపించాలని ఆకాంక్షించారు.
గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి ప్రచారం మొదలు పెట్టారు. ఈ ఎన్నికలు చంద్రబాబు-జగన్ మధ్య కావని...మోదీ - బాబుకి మధ్య జరుగుతున్నవని అన్నారు. వైకాపాకు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని స్పష్టం చేశారు. రేపల్లె నుంచి తెదేపా తరపున పోటీ చేస్తున్న అనగాని సత్యప్రసాద్ పేటేరు గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. తెనాలిలో తెదేపాఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సతీమణి ఇంటింటి ప్రచారం నిర్వహించి... భర్త తరపున ఓట్లను అభ్యర్థించారు. వేమూరులో మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రచారం చేపట్టారు. స్థానిక తెదేపా కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగిఓట్లు అభ్యర్థించారు. గుంటూరు నుంచి వైకాపా తరపున పార్లమెంటుకు పోటీ చేస్తున్న మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇద్దరూ ప్రచారం ప్రారంభించారు. తాడేపల్లి మండలం సీతానగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టారు.
జనసేన పార్టీ తరపున పత్తిపాడు నుంచి పోటీ చేస్తున్న జనసేన అసెంబ్లీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు జొన్నలగడ్డ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడిగారు.

Last Updated : Mar 18, 2019, 6:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details