గుంటూరు జిల్లాలో కొవిడ్ మరణాలు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో మృతదేహాల అంత్యక్రియలపై అధికారులు దృష్టి పెట్టారు. నగరంలోని స్తంభాల గరువు శ్మశాన వాటికలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికను జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారభించారు.
అక్కడ నిర్వహణ ఖర్చు ఎక్కువ..
విద్యుత్ దహన వాటికలో నిర్వహణ ఖర్చు ఎక్కువ కావటంతోపాటు.. కాలుష్యం కూడా ఉంటుందన్నారు. అందుకే దాతల సాయంతో గ్యాస్ ఆధారిత దహన వాటికను ఏర్పాటు చేసినట్లు జేసీ వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంలో రోజుకు 20 మృతదేహాలను దహనం చేసే వీలుందన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిమ్నీ వల్ల.. కాలుష్యం వెదజల్లకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.