PAWAN KALYAN COMMENTS: సమాజం కోసం బాధ్యతగా నిలబడేవారు ప్రజల కోసం పోరాడే మహిళలు.. ప్రస్తుత రాజకీయాలకు ఎంతో అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్లోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఝాన్సీ లక్ష్మీభాయి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయిని ఆదర్శంగా తీసుకుని.. జనసేన మహిళా విభాగానికి ఆమె పేరు పెట్టినట్లు వివరించారు. రాజకీయాల్లో ఉన్న వారు బాధ్యతగా మాట్లాడాలని అన్నారు. కానీ, తెలుగు రాష్ట్రాలలో కొందరు మహిళా నాయకురాళ్లకు బాధ్యత లేకుండా పోయిందని పవన్ విమర్శించారు. మహిళలపై అత్యాచారాల విషయంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. జనసేన వీర మహిళలు చేస్తున్న పోరాటాలకు అక్రమార్కులు భయపడుతున్నారని పవన్ ప్రశంసించారు.
ప్రజల కోసం పోరాడే మహిళలు రాజకీయాలకు అవసరం: పవన్ కల్యాణ్ - Janasena Latest News
PAWAN KALYAN: ఎంతటి కష్టాన్నైనా ఎదురించే శక్తి కల్గినా మహిళలే జనసేనకు స్పూర్తిదాయకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పారాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీభాయి గొప్పవారని గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్
"ఇప్పుడు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు . ఒకట్రెండు మానభంగాలు జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మైండ్ సెట్ ను మనం మార్చాలి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యం చేసి హత్య చేశారు.. దివ్యాంగురాలైన ఆమె తల్లి న్యాయం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా సమాజంలో చలనం లేకుండా పోయింది.. ఆడబిడ్డల సంరక్షణ చాలా ముఖ్యమైంది."-పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు
ఇవీ చదవండి: