ఆర్థిక ఇబ్బందులకు తోడు లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా పనులు లేకపోవడం వల్ల ఒక స్వర్ణకారుడు జీవితం చాలించాడు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన బండారు నాగేశ్వరరావు విజయవాడలో బంగారు నగలు తయారుచేసేవారు. మూడేళ్ల క్రితం కుటుంబంతో తెనాలి వచ్చి, ఇక్కడి షరాఫ్‌బజార్‌లో చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకుని పనులు చేస్తున్నారు. కొంతకాలంగా పనులు తక్కువగా ఉంటున్నందున కుటుంబపోషణ కోసం అప్పులు చేశారు. దీనికితోడు లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా పనులు లేకపోవడం వల్ల ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి దుకాణానికి వెళ్లిన ఆయన.. రాత్రయినా తిరిగి రాలేదు. 10 గంటల సమయంలో సహచరులు దుకాణంలో తాను పనిచేసే చోటే నాగేశ్వరరావు పడి ఉండడాన్ని చూసి, ఆయన కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది పరీక్షించి నాగేశ్వరరావు అప్పటికే మృతి చెందారని చెప్పారు. సైనైడ్ వంటి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నట్టు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు.
పనులు లేక.. బతుకు సాగక.. స్వర్ణకారుడు ఆత్మహత్య - jeweller suicide news
లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో గుంటూరు జిల్లా తెనాలిలో ఓ స్వర్ణకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులు లేక బతుకు సాగే దారి తెలియక.. కుటుంబ పోషణ భారమై విషం తాగి తనువు చాలించాడు.
పనులు లేక.. బతుకు సాగక.. స్వర్ణకారుడు ఆత్మహత్య