వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి , ఆయన కుమారుడు ఆస్మిత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకున్నారు .పిటిషన్లపై విచారణ జరిపి తాము ఉత్తర్వులు జారీచేస్తే.. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైకోర్టు పేర్కొంది. బెయిలు కోసం దిగువ కోర్టును ఆశ్రయించడం ఉత్తమమని సూచించింది . దీంతో పిటిషన్లను ఉపసంహరించుకొని దిగువ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ అందుకు అంగీకరించారు.
హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి! - బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి , ఆయన కుమారుడు ఆస్మిత్ రెడ్డి ..వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణల కేసులో హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. పిటిషన్లపై విచారణ జరిపి తాము ఉత్తర్వులు జారీచేస్తే.. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైకోర్టు పేర్కొంది. బెయిలు కోసం దిగువ కోర్టును ఆశ్రయించడం ఉత్తమమని సూచించింది
సుప్రీంకోర్టు బీఎస్ 3 వాహనాల్ని నిషేధించిందని.. వాటిని బీఎస్ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా రహదారులపై ఎలా తిప్పుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంది. ఇలాంటి వాహనాలు ప్రమాదానికి గురై ప్రాణాలు పోతే.. బాధ్యత ఎవరు తీసుకుంటారని కోర్టు అసహనం వ్యక్తంచేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిపై ఆరోపణలు చాలా తీవ్రమైనదని వ్యాఖ్యానించింది. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది.. ప్రత్యూమ్నకుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. ఇదే విషయంలో పిటిషనర్లపై 46 కేసులు నమోదు చేశారని తెలిపారు. కక్షసాధింపు కోసం ఒకే అంశంపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు