కరోనా వైరస్ నివారణ చర్యలపై గుంటూరు సంయుక్త కలెక్టర్.. డివిజన్ స్థాయి రిసెప్షన్ సెంటర్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా జిల్లా స్థాయిలో ఉన్న రిసెప్షన్ సెంటర్ నుంచి నోడల్ అధికారులు నివారణ చర్యలను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని జేసీ దినేష్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థతో పాటు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, దాచేపల్లి రెవిన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం ఐదు రిసెప్షన్ సెంటర్ల ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజన్ స్థాయిలో నియమించిన నిఘా, నిర్వహణ బృందాల నోడల్ అధికారులు వారికి సంబంధించి అంశాలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన కోవిడ్ -19 ఆర్డర్ల పై పూర్తిగా అవగాహన పెంచుకుని విధులు నిర్వహించాలన్నారు.
కరోనా నియంత్రణ చర్యలపై జేసీ సమావేశం - Jc meeting on corona control at guntur news udpate
ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని జేసీ దినేష్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు సంయుక్త కలెక్టర్.. డివిజన్ స్థాయి రిసెప్షన్ సెంటర్ నోడల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
కరోనా నియంత్రణ చర్యలపై జేసీ సమావేశం