గుంటూరు సర్వజన ఆసుపత్రిలోని కరోనా వార్డులను జాయింట్ కలెక్టర్ ప్రశాంతి తనిఖీ చేశారు. కరోనా వార్డుల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారా.. నర్సులు సకాలంలో స్పందిస్తున్నారా... నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని కొవిడ్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్ అందుతున్న తీరును పరిశీలించారు.
కరోనా వార్డులు పరిశీలించిన జేసీ...సేవలపై ఆరా - గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి తాజా వార్తలు
గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి... జిల్లా సర్వజన ఆసుపత్రిలోని కరోనా వార్డులను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
సర్వజన ఆసుపత్రిలోని కరోనా వార్డులు పరిశీలించిన జేసీ
ఆక్సిజన్ పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులోకి రావడంతో... మరో మూడు ఐసీయూ వార్డులను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి జేసీకు వివరించారు. ఈ వార్డులతో మరో 50 బెడ్స్ అదనంగా వస్తాయని.. దీంతో మరింత మందికి సేవలు అందించవచ్చని ప్రభావతి తెలిపారు.
ఇవీ చూడండి...