Javelin throw player Rashmi: కర్ణాటకలోని పుత్తూరు గ్రామానికి చెందిన రష్మి.. అథ్లెట్ గా అంచెలంచెలుగా ఎదిగారు. 15 ఏళ్ల వయసులో జావెలిన్ చేతబట్టి సత్తా చాటారు. ఇప్పటివరకు జాతీయ, రాష్ట్రస్థాయిలో 20 పతకాలు రష్మి సాధించారు. 2009 కొచ్చిలో సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం ఒడిసిపట్టారు. 2010-11 మధ్యకాలంలో పుణెలో జరిగిన నేషనల్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం, 2012లో నేషనల్ ఇంటర్ జోనల్ అథ్లెటిక్స్ పోటీల్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. లక్నోలో జరిగిన 28వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకంతో మెరిసిన రష్మి.. 2013లో ఇంటర్ యూనివర్సిటీలో అథ్లెటిక్స్ టోర్నమెంటులో కాంస్యం దక్కించుకున్నారు. 2014 నుంచి 2019 వరకు వివిధ జాతీయస్థాయి పోటీల్లో రజత, కాంస్య పతకాలు సంపాదించారు.
మరో అథ్లెట్ దుర్గారావుతో వివాహం తర్వాత ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతోన్న రష్మి.. వచ్చే ఆసియన్ గేమ్స్ లో పతకం సాధించడం తన లక్ష్యమని చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా నేను జావెలిన్ త్రో ఆడుతున్నాను. ఇప్పటివరకూ 20 పతకాలు సాధించాను. ఏషియన్, జాతీయ క్రీడల్లో పతకాలు సాధించడమే నా లక్ష్యం. హరియాణాలో నేను నా సాధన కొనసాగిస్తున్నాను. రాజేంద్రసింగ్ నా కోచ్. నాకు స్పాన్సర్ కావాలి.