కొత్త వేతన స్కేలు అమలు... ఉద్యోగుల చరవాణికి సమాచారం - new pay scale implemented in AP
![కొత్త వేతన స్కేలు అమలు... ఉద్యోగుల చరవాణికి సమాచారం new pay scale](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14335448-983-14335448-1643658150016.jpg)
23:23 January 31
జనవరి నెల వేతనాలు కొత్త వేతన స్కేలు ప్రకారం అమలు
Implemented new pay scale: ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం అమలు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కితీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 జనవరి వేతనాలు రివైజ్డ్ పే స్కేల్ ప్రకారంమే వేతనాలు చెల్లించిన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్‌లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఉద్యోగుల చరవాణులకు వేతనానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం వస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు