ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీ కులాల అభివృద్ధి కన్నా నష్టం ఎక్కువ' - Jangama Corporation latest news

బీసీ కార్పొరేషన్​ల ఏర్పాటులో లోపాల వలన బీసీ కులాల అభివృద్ధి కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని... జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగలింగం పేర్కొన్నారు. చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, విజయనగరం జిల్లాలకు ప్రాధాన్యత కల్పించకపోవటం తీవ్ర ఆక్షేపనీయమన్నారు.

Jangama Corporation upset on Corporations formation
నాగలింగం

By

Published : Oct 20, 2020, 10:56 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్​ల ఏర్పాటులో లోపాల వలన బీసీ కులాల అభివృద్ధి కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని... జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగలింగం పేర్కొన్నారు. జంగమ కార్పొరేషన్​లో డైరెక్టర్ల నియామకంలో చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, విజయనగరం జిల్లాలకు ప్రాధాన్యత కల్పించకపోవటం తీవ్ర ఆక్షేపనీయమన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా జంగమ జనాభా కలిగిన చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో.. జంగమ కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయని ప్రభుత్వం గుర్తించలేదన్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఛైర్మన్ అభ్యర్థి నియామకంపై జంగంలకు పలు అనుమానాలు లేకపోలేదని... ఆ ప్రాంతంలో జంగంలు ఎక్కువ మంది ఎస్సీ సర్టిఫికెట్ మీద ఉద్యోగాలు చేస్తూ న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొని ఉన్నారని నాగలింగం పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details