కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పక్క రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నాయన్నారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతికి పంపేలా చూడాలని కోరారు. మొండిగా పరీక్షలు నిర్వహిస్తే... ఎవరైనా పిల్లలు కరోనా భారిన పడితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి నిధులు మిగిలించుకోవడం కోసమే పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేశారని ఆరోపించారు.
'పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి'
పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌నాయుడు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు.
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్