రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు - రేపల్లె తాజా వార్తలు
జనతా కర్ఫ్యూ కారణంగా గుంటూరు జిల్లా రేపల్లె ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిజాంపట్నం హార్బర్ వద్ద పడవలు జెట్టికే పరిమితమయ్యాయి.
రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీరప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. రోడ్లపై వాహనాలు నడవకపోవటంతో రహదారులన్నీ బోసిపోయాయి. రేపల్లె నుంచి సికింద్రాబాద్కు వెళ్ళవలసిన రైలును స్టేషన్ వద్దనే నిలిపివేశారు. చేపల ఎగుమతిలో జిల్లాలో ప్రధాన కేంద్రమైన నిజాంపట్నం హార్బర్ వద్ద సముద్రపు చేపలు, రొయ్యల రవాణా కూడా నిలిచిపోయింది.