గుంటూరు ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. గుంటూరులోని ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. షాపింగ్ మాల్స్, మాంసం దుకాణాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1053 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గుంటూరు డివిజన్లో 27 ప్యాసింజర్, 5 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్ల షెడ్యూళ్లు మార్చారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులన్నీ కర్ఫ్యూ కారణంగా వెలవెలబోతున్నాయి. మరిన్ని వివరాలు గుంటూరు నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
గుంటూరు: జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనాలు - గుంటూరులో జనతా కర్ఫ్యూ
గుంటూరులో ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లన్నీ ఖాళీగా దర్శినమిస్తున్నాయి.
గుంటూరులో జనతా కర్ఫ్యూ