ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనతా కర్ఫ్యూ : ఇళ్ల నుంచే అమరావతి దీక్షలు

జనతా కర్ఫ్యూ దృష్ట్యా రాజధాని రైతులు ఇళ్ల నుంచే నిరసనలు కొనసాగించనున్నారు. కర్ఫ్యూ ప్రారంభానికి ముందు అరగంట, పూర్తయ్యాక అరగంట పాటు దీక్ష శిబిరాల్లో ఆందోళనలు చేయనున్నారు. అలాగే ప్రతిరోజూ రాత్రి ఏడున్నర గంటలకు "అమరావతి వెలుగు" పేరిట ఇళ్లలో లైట్లు ఆపేసి... కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్నారు.

ఇళ్ల నుంచే అమరావతి దీక్షలు
ఇళ్ల నుంచే అమరావతి దీక్షలు

By

Published : Mar 22, 2020, 5:06 AM IST

Updated : Mar 22, 2020, 6:51 AM IST

రాజధాని అమరావతి ప్రజల పోరాటం 96వ రోజుకు చేరింది. కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతాకర్ఫ్యూను పాటిస్తూ ఇవాళ ఆందోళనలు కొనసాగించనున్నారు. ఇప్పటికైనా తమ నిరసనలను గుర్తించి... తాను శంకుస్థాపన చేసిన అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు మోదీ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో "అమరావతి వెలుగు" పేరిట నిరసనలకు రైతులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అందరి ఇళ్లలో ప్రతి రోజూ సాయంత్రం కొద్దీ సేపు లైట్లు ఆపేసి... కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలుపుతున్నారు. జైఅమరావతి అని నినదిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొండిపట్టుదలకు పోకుండా... రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇళ్ల నుంచే అమరావతి దీక్షలు

ఇదీచదవండి

కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు

Last Updated : Mar 22, 2020, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details