Vishaka ukku parirakshana deeksha: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇవాళ జరగబోయే.. విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షకు జనసైనికులు ఏర్పాట్లు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ నేడు సంఘీభావ దీక్ష చేయనున్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు.. అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని విశాఖ సభలో పవన్ డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. పవన్ కల్యాణ్ దీక్షకు సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.