ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నివారణ కంటే.. రాజకీయ ప్రత్యర్థులపై దృష్టి పెట్టారు' - pawan hot comments on ycp leaders

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని.. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పెద్దలు రాజకీయాలు చేయడం తగదని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. కన్నాపై వ్యక్తిగత విమర్శలను తప్పుబట్టిన ఆయన.. రాష్ట్రం నుంచి కరోనాను తరిమేంత వరకూ రాజకీయాలు పక్కన పెట్టాలని సూచించారు.

'కరోనా నివారణ కంటే.. రాజకీయ ప్రత్యర్థులపై దృష్టి పెట్టారు'
'కరోనా నివారణ కంటే.. రాజకీయ ప్రత్యర్థులపై దృష్టి పెట్టారు'

By

Published : Apr 22, 2020, 8:41 PM IST

'కరోనా నివారణ కంటే.. రాజకీయ ప్రత్యర్థులపై దృష్టి పెట్టారు'

రాష్ట్రంలో కరోనా నివారణ కంటే రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ విమర్శించారు. గత రెండు మూడు రోజులుగా జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో.. అత్యవసర వైద్య సైవలపై దృష్టి పెట్టాల్సింది పోయి.. రాజకీయాలను భుజాలకు ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగమేనని పవన్​ అభిప్రాయపడ్డారు.

రాజకీయాలు పక్కన పెడదాం

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే.. ఎప్పటికి శాంతిస్తుందో ఊహకు అందడం లేదని పవన్​ కల్యాణ్​ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా మహమ్మారి రాష్ట్రం, దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామని జనసేనాని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం, వారి ఆకలి తీర్చడంపైనే మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పవన్​ సూచించారు. ఈ సమయంలో కూడా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందని హెచ్ఛరించారు.

ఇదీ చూడండి:

కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details