ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదు' - లేటెస్ట్ మీట్ ఆఫ్ పవన్ కల్యాణ్

ఏ రాజకీయ పార్టీకైనా లీగల్ విభాగం ఆయువుపట్టని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ నుంచి అభ్యర్థుల నామినేషన్ వరకు ప్రతి సందర్భంలోనూ ఈ విభాగం అవసరం ఎంతైనా ఉందన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన న్యాయ విభాగంతో పవన్ సమావేశమయ్యారు.

janasena leagal cell
'జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదు'

By

Published : Feb 16, 2020, 11:47 PM IST

'జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదు'

దేశానికి స్వేచ్ఛా వాయువులు ఇవ్వడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజ ప్రక్షాళన కోసం అంతే బలంగా నిలబడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు రాజకీయాల్లోకి వస్తే తప్ప... సమాజంలో మార్పు రాదన్నారు. సామాన్యులకు, జనసేన కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనే దానిపై న్యాయవాదులకు జనసేనాని దిశానిర్దేశం చేశారు.

విలీనం ప్రసక్తే లేదు...

జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని జనసేనాని పవన్‌ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకునే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. సమాజానికి సేవ చేసే సత్తా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. రాజకీయాలు తనకు రిటైర్మెంట్ ప్లాన్ కాదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి-'విజయసాయిరెడ్డి కన్ను ఆ భూములపై పడింది'

ABOUT THE AUTHOR

...view details