ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PAWAN KALYAN: సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే ప్రధాన లక్ష్యం: పవన్‌ - కరోనా డెత్స్

కరోనా(corona) విపత్తుతో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్(pawan kalyan) అన్నారు. జనసైనికులు, వారి కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారన్నారు. జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమేనని పవన్ అన్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/07-July-2021/12381144_pavan.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/07-July-2021/12381144_pavan.jpg

By

Published : Jul 7, 2021, 12:26 PM IST

Updated : Jul 7, 2021, 12:55 PM IST

జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే: పవన్‌

కరోనాతో చాలా మంది చనిపోయారని జనసేనాని(janasena) పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన సన్నిహితులు, బంధువులు చాలామందిని కోల్పోయానని చెప్పారు. కొవిడ్(covid) బారినపడి మృతి చెందినవారికి పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. విపత్తులో చనిపోయిన ప్రతిఒక్కరికి జనసేన తరఫున నివాళులు అర్పిస్తున్నామని పవన్ తెలిపారు. నంద్యాలకు(nandyala) చెందిన ఆకుల సోమశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కు అందజేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది.

జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తోంది. అందరి అభిమానం, నాయకుల అండతో పార్టీ నిలబడింది. కరోనా విపత్తు సమయంలో జనసైనికులు ధైర్యంగా సహాయం చేశారు. ప్రజలు కూడా మనోబలంతో కరోనా విపత్తును ఎదుర్కొంటున్నారు. జనసైనికులకు పార్టీ అండగా ఉంటోంది. పార్టీ బీమా పథకానికి నేను రూ.కోటి ఇచ్చా. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

జనసేన పార్టీ కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ సమస్యపై పవన్‌కల్యాణ్‌ను నిరుద్యోగులు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:రాజధానిలో మాజీ మంత్రి భార్య దారుణ హత్య

Last Updated : Jul 7, 2021, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details