విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో నష్టపోయిన బాధితులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయినవారిని కోల్పోయి, రకరకాల అనారోగ్య సమస్యలతో ఎంత వేదనకు లోనవుతున్నారో అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటామన్నారు. పరిశ్రమలో ప్రమాద హెచ్చరికలు చేసే అలారం పనిచేయకపోవడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పులా పరిణమించిన పరిశ్రమను తక్షణం అక్కడి నుంచి తరలించాలన్నారు.
'విశాఖ బాధితులకు జనసేన అండగా ఉంటుంది'
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకూ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
'విశాఖ బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది'