Janasena PAC Meeting: భవిష్యత్ కార్యాచరణ కోసం.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈనెల 30వ తేదీన సమావేశం కానుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో.. విశాఖ పర్యటనలో ప్రభుత్వం నుంచి తలెత్తిన ఇబ్బందులు, తదనంతరం జరిగిన పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. అంతేకాకుండా అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం, భాజపాపై అసంతృప్తి వ్యక్తం చేయటం.. అదే సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు.. పవన్ను కలవటంపై రాష్ట్రంలో రాజకీయ మార్పులకు దారితీస్తాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. అందుకే జనసేన పార్టీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈనెల 30న జనసేన పార్టీ పీఏసీ సమావేశం - ఏపీ వార్తలు
Janasena PAC Meeting: ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు వేడిని రగుల్చుతున్నాయి. దీనిలో భాగంగానే జనసేన పార్టీ సమావేశం కానుంది. ఇటీవల పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరగనుంది.
Janasena PAC Meeting
ఈనెల 30, 31న పార్టీకి సంబంధించిన సమావేశాలుంటాయని జనసేన వర్గాలు తెలిపాయి. సమావేశం కారణంగా రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉంటారని సమాచారం.
ఇవీ చదవండి :