విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వ్యతిరేకంగా ఈనెల 31న విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి 10 వేల మంది కార్యకర్తలు తరలివెళ్తారని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ... ఎయిడెడ్ కళాశాలను మూసివేయడం దుర్మార్గపు చర్య అని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు మహా నగరంలో ఒక ప్రభుత్వ కళాశాల కూడా లేక పోవడం బాధాకరమన్నారు. ఉన్న ఎయిడెడ్ కళాశాలను మూసివేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
'విశాఖ నిరసన సభకు గుంటూరుజిల్లా నుంచి పదివేల మంది కార్యకర్తలు'
విశాఖలో పవన్ కల్యాణ్ చేపట్టే నిరసన కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి పదివేల మంది కార్యకర్తలు పాల్గొంటారని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిడెడ్ కళాశాలను మూసివేయడం దారుణమన్నారు.
జనసేన మీడియా సమావేశం
గురజాల పంచాయతీలో ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందన్న ఆయన... అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారని జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా నేతలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడ చూడలేదన్నారు.