మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు రాజధానుల అంశంపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానంపై మాట్లాడనున్నారు. జనసేన నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించనున్నారు. రాజధాని గ్రామాల్లో పార్టీ నాయకుల పర్యటన నివేదికపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
మంగళగిరిలో నేడు జనసేన విస్తృత స్థాయి సమావేశం - జనసేన విస్తృతస్థాయి సమావేశం న్యూస్
మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇవాళ జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ముఖ్యమైన విభాగాల నాయకులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు.
janasena party meeting at mangalagiri
Last Updated : Dec 30, 2019, 4:47 AM IST