ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం కేసీఆర్‌ను కలిసిన జనసేన పార్టీ సలహాదారు రామ్మోహన్‌రావు - కేసీఆర్​ను కలిసిన జనసేన సలహాదారు రామ్మోహన్‌రావు

Janasena Party Advisor met CM KCR: బీఆర్​ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తదితరులతో కలిసి జనసేన పార్టీ సలహాదారు, తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

janasena  leader
జనసేన నాయకుడు

By

Published : Jan 11, 2023, 10:30 PM IST

Janasena Party Advisor met CM KCR: బీఆర్​ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ను జనసేన పార్టీ సలహాదారుడు, తమిళనాడు మాజీ సీఎస్‌ ఆర్‌.రామ్మోహన్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్​ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, పార్థసారధి, తదితరులతో పాటు బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసిన రామ్మోహన్‌రావు.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు, ఇతర విషయాలపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్ర సీఎస్‌గా శాంతికుమారిని నియమించినందుకు కేసీఆర్‌కు రామ్మోహన్‌రావు, బీఆర్​ఎస్ ఏపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సీఎస్‌ శాంతికుమారిని అభినందించారు. గతంలో తమిళనాడు సీఎస్​గా పనిచేసిన ఆర్​. రామ్మోహన్​రావు.. ప్రస్తుతం పవన్​కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి అడ్వైజర్​గా ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్​ఎస్ కార్యకలాపాలు ఊపందుకుంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ హాజరుకానున్నారు.

ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని ఇటీవల పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందని, పెద్దఎత్తున చేరికలుంటాయని భారాస నేతలు చెబుతున్న నేపథ్యంలో.. మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు.. సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details