ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధాని ఒకేచోట ఉండాలి.. అక్కడినుంచే పాలన సాగాలి' - పవన్‌కల్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ విస్తృత సమావేశం

మంగళగిరిలో పవన్‌కల్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ విస్తృత సమావేశం జరుగుతోంది. రాజధాని అమరావతి అంశంపై నేతలు చర్చిస్తున్నారు. రాజధాని ఒకేచోట ఉండాలని, అక్కడినుంచే పాలన సాగాలని నేతలు అభిప్రాయపడ్డారు. 7నెలల్లో ఇంతగా ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఎప్పుడూ లేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. రాజధాని గ్రామాల్లో పోలీసులు ఇళ్లకు వెళ్లి తాళాలు వేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

janasena-manohar-on-capital
janasena-manohar-on-capital

By

Published : Jan 11, 2020, 1:00 PM IST

'రాజధాని ఒకేచోట ఉండాలి.. అక్కడి నుంచే పాలన సాగాలి'

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. రాజధాని ఒకేచోట ఉండాలి.... పరిపాలన అక్కడినుంచే సాగాలనే తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంటుందని నేతలు సూచించారు. ఏడు నెలల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఎప్పుడూ లేదని జనసేన నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేపట్టిన జగన్... ఇపుడు రైతులతో మాట్లాడకపోవటం దారుణమని నాదెండ్ల వ్యాఖ్యానించారు. రాజధానిలో పోలీసుల చర్యలతో యుద్ధ వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details