గుంటూరు జిల్లా తాడేపల్లి యూ-1 జోన్ రైతుల సమస్యలను.. పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు చెప్పారు. యూ-వన్ జోన్ ఎత్తివేయాలంటూ తాడేపల్లిలో ఆందోళన చేస్తున్న రైతులకు జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు మద్దతు తెలిపారు. రైతులతో కలసి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఈ సందర్భంగా.. నాయకులు విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లి.. వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
'యూ-వన్ జోన్ రైతుల సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం' - U One Zone farmers protest news
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని యూ-వన్ జోన్ రైతుల సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు.
janasena