గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని 41వ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న తమను వైకాపా, తెదేపా శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ.. గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.