ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతలకు అలవాటుగా మారిపోయింది' - guntur jansena on ycp

హైకోర్టు తీర్పుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా నమోదు చేయాలని... జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. కోర్టు తీర్పులను వైకాపా నేతలకు తప్పుపట్టం అలవాటుగా మారిందని ఆగ్రహించారు.

janasena leaders on ycp comments on high court judgement
వైకాపా నేతలపై మండిపడిన జనసేన

By

Published : May 23, 2020, 6:00 PM IST

డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గాదె వెంకటేశ్వరరావు ఖండించారు. బాధ్యత గల హోదాలో ఉన్న ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టుపై, న్యాయవాదులపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

కోర్టు ఎప్పుడూ బాధితులకు న్యాయం చేయడానికే ఉందని చెప్పారు. కోర్టు తీర్పులను తప్పుపట్టటం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. హైకోర్ట్ తీర్పుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details