ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Janasena leaders fire on YSRCP: సభలకు జనం రావడం లేదని.. పవన్​పై జగన్​ ఆరోపణలు: జనసేన నేతలు - పవన్ పై జగన్ కామెట్ వీడియోలు

Janasena Leaders Comments: జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఖండించారు. సీఎం జగన్ సభల్లో ప్రసంగించే ముందు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. స్కూల్ పిల్లలు ఉన్న సభలో ముఖ్యమంత్రి అలాంటి మాటలు మాట్లాడటం విచారకరం అని పేర్కొన్నారు. సీఎం సభకు జనాలు రాకపోవడం వల్లే... ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడారని ఎద్దేవా చేశారు.

Janasena Leaders Comments
Janasena Leaders Comments

By

Published : Jun 29, 2023, 9:52 PM IST

Janasena Leaders Fires On CM Jagan: మన్యం జిల్లా పర్యటనలో భాగంగా అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై చేసిన వ్యాఖ్యల పట్ల, జనసేన పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సభామర్యాద లేకుండా మాట్లాడుతున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుపాం సభలో సీఎం మాటలు వింటుంటే చాలా డిప్రెషన్‌లో ఉన్నట్లు కనబడుతుందన్నారు. బటన్‌ నొక్కితే అన్ని సమస్యలు తీరిపోయాయన్నట్లుగా సీఎం భావిస్తున్నారన్నారు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారన్న గాదె ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ వారాహియాత్రతో జగన్‌కు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని గాదె వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు.

కురుపాం నియోజకవర్గ కేంద్రంలో జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్​పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విద్యార్థుల ముందు భార్యలు, పెళ్లిళ్ల గురించి మాట్లాడటంపై విమర్శలు గుప్పించారు. దమ్ముంటే రాజకీయంగా.. ఎదుర్కొవాలన్న బాబు.. వ్యక్తిగత జీవితంపై విమర్శలు ఏంటని ప్రశ్నించారు. జగన్ సభకు జనం రాలేదని వైసీపీ నేతల వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఆ సమావేశానికి హాజరయ్యారని బాబు పాలూరు ఆరోపించారు. వచ్చిన జనం కంటే వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. సీఎం చేసిన ఆరోపణలపై ప్రజలు చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం సభకు వచ్చిన స్కూల్ పిల్లలు సైతం జగన్ మోహన్ రెడ్డిని తిట్టే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని బాబు పాలూరు వెల్లడించారు. 2024లో వైసీపీ ఓడిపోవడం ఖాయం అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్​కు ప్రజలు నీరాజనం పడుతున్నారనే అక్కసుతో జగన్ ఆరోపణలు చేస్తున్నారని బాబు పాలూరు మండిపడ్డారు.

మఖ్యమంత్రి జగన్ చేసిన వాఖ్యలపై విజయనగరం జనసేన నాయకుడు గురాన అయ్యాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రిఅలా వ్యవహరించటం సరికాదని హితవు పలికారు. అందులోనూ విద్యార్ధుల ముందు, రాజకీయాలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. పవన్ కల్యాణ్ కేవలం ఒక్క వర్గానికే కాదు.. అన్ని కులాలకు దత్తపుత్రుడని తెలిపారు. పెళ్లిళ్ల విషయంలో ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారని అయ్యాలు పేర్కొన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా.. సీఎం జగన్.., భారతీయ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details