భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు జనసేన ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వర్ణ, చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేయబోయే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి జనసేన నేతలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రూ. 2 లక్షల చెక్కులను విరాళంగా ఇచ్చారు. ఎన్టీఆర్ గృహ లబ్ధిదారుల పోరాట సంఘం నేతలు పవన్ను కలవగా... మీకు తోడుగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి రూ.2 లక్షల విరాళం - భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి వార్తలు
గుంటూరులో పవన్ కల్యాణ్ వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి జనసేన నేతలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రూ.2 లక్షల చెక్కులను విరాళంగా ఇచ్చారు.
చెక్కు తీసుకుంటున్న జనసేన అధినేత పవన్